గుండె శబ్దము వెనక
ప్రేమ గ్రంధము చదువు
నా నోటి మాటది తెలుపలేదేమో
తెలుప రాక నిను నొప్పించిందేమో
కళ్ళ లోతులలోని
ప్రేమ కోకిలలు విను
ఆపాట నానోట పలకదేమో
పలికినా ఒలికిన భావం నీకు నప్పలేదేమో
అలిగిన నెచ్చెలి నీవు - నవ్వవూ
నీ కనుకొనలలో ఆశ్రయమివ్వవూ
అది దొరకకేగా కాలమెంతో కఠినమనిపిస్తుంది
అలిగిన నీడా నానుంచి జరిగినట్టనిపిస్తుంది
నా ప్రేమలోని నిజం నిప్పులాంటిది
చేరిన నివురు ఏ రోజో తొలుగుతుంది
చెదిరిన నివురు నీ కళ్ళకు చెమ్మ తెస్తుందేమో
విరిగిన ఈ గుండె కోటలు ఆరోజు తిరిగి కట్టలేమేమో
అందుకే చెలీ - ఈ రోజే
గుండె శబ్దము వెనక
ప్రేమ గ్రంధము చదువు
కళ్ళ లోతులలోని
ప్రేమ కోకిలలు విను
లోకుల కాకుల కేకలనుపేక్షించు
తెరిచిన నా యెద గడపలలోపల ఉపశమించు
కంటి పాపల కౌగిలినాశ్రయించు
నా మనసు పొత్తిళ్ళ నిద్రకు సాహసించు
gunDe Sabdamu venaka
prEma grandhamu caduvu
naa nOTi maaTadi telupalEdEmO
telupa raaka ninu noppincindEmO
kaLLa lOtulalOni
prEma kOkilalu vinu
aapaaTa naanOTa palakadEmO
palikinaa olikina bhaavam neeku nappalEdEmO
aligina necceli neevu - navvavuu
nee kanukonalalO aaSrayamivvavuu
adi dorakakEgaa kaalamentO kaThinamanipistundi
aligina neeDaa naanunci jariginaTTanipistundi
naa prEmalOni nijam nippulaanTidi
cErina nivuru E rOjO tolugutundi
cedirina nivuru nee kaLLaku cemma testundEmO
virigina ee gunDe kOTalu aarOju tirigi kaTTalEmEmO
andukE celii - ee rOjE
gunDe Sabdamu venaka
prEma grandhamu caduvu
kaLLa lOtulalOni
prEma kOkilalu vinu
lOkula kaakula kEkalanupEkshincu
tericina naa yeda gaDapalalOpala upaSamincu
kanTi paapala kougilinaaSrayincu
naa manasu pottiLLa nidraku saahasincu
గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...