5, జనవరి 2009, సోమవారం

సంకలనం

ఊసు
-----

నీ ఊసు వినాలని
ఏశబ్దం రాకూడదని
రెప్ప సైతం ఆర్ప కున్నాను
శ్వాస కూడా అపుకున్నాను

కానీ
నీ గుండెగది దాటని ఊసుల సాక్షిగ
మన మూగ చూపుల మౌన భాషలు
ఎదలో రేపిన అలజడి చూశావుగా

అదేమిటో
మన సమక్ష పరోక్షాల్లో వినని
మన మనసు చేష్ఠలు, భవ భావ
బంధాలను అనుబంధాలుగా మార్చే
చల్ల గాలులు, అల్లరిచేస్తున్నట్టనిపిస్తాయి


అక్కున చేరమంటున్నాయి
ప్రేమగా
ఆరాధమించమంటున్నాయి


మర్మం
-----
రాత్రీ పగలు దీపాలెలిగినా
గుండెలొ చీకటి దూరంకాదే ?
ఎక్కడ ఉందో నచ్చిన దేవత
వెలుగులు తానై యెదలో దిగదే ?

సూర్య చంద్రులు ఉన్నాగానీ
దేవిని చూపే అణుకువ లేదే ?
వెలుగును పంచి దేవిని చేర్చే
గ్రీకు దేవతా కనపడ రాదే ?

వెలుతురు ఉండీ చీకటి ఎంటో
దేవిని కానని శాపం ఎంటో
చీకటి నడకకు అంతం ఎంటో
ఇక్కడ దాగిన మర్మం ఎంటో


------------------------------

మనసు లోని తలుపు గడియ తీసి
గతము వల్ల పడిన ముడులు విప్పి
భజన చేయు నపుడు అహము నొగ్గి
హరుని వేడు నతని బ్రతుకు హాయి

------------------------------

చెదిరిన కల భావము నేర్పగ
విరిగిన యెద భాషను కూర్చగ
మనసు గోడల గ్రంధము పైన
రుధిర ధారలు ఇంధన మైన
కలమున కారెను కవితా ధారలు
బరువుగ జార్చెను కనులా గాధను


----------------------------
తెరచాప
తెలియని తెడ్డు పడవ నాది
దిక్కు కలవని బ్రతుకు గమనము మనది
నీ చూపు చుక్కాని నమ్ముకున్నాను
అది లేని నాబ్రతుకునమ్ముకున్నాను
ఏదారి పోలేక గోదారి నడిమిట్ల
పరువాల నీదారినొదులుకున్నాను
ఏదారి కనరాక ఇక్కట్ల బ్రతుకులో
భారాన నదిని దాటుతున్నాను
----------------------------

--
మనసున శ్రీపతి స్థాపన చేసి
జీవన జలధిని మధనము చేయగ
రేపటి ఉదయపు రూపును చేకొని
ఆశల భాండము అమృతమిచ్చె

------------------------------

--------------