8, అక్టోబర్ 2008, బుధవారం

నే కోరుకున్నది


గలగల పారే నీ నవ్వు
గిలిగింతలు పెట్టే నీ మాట
హాయిని కురిసే నీ కళ్ళు
ఆ సహజత్వమె నేకోరుకున్నది

నొప్పించని నీ గుణం
లాలించే నీ మనసు
క్షమించే నీ తత్వం
ఆ సున్నితత్వమే నేకోరుకున్నది

చనువుగా తిరిగే నీ వైనం
విసుగనిపించని నీ ఊసులు
వినసొంపైన నీ గళం
ఆ స్నేహత్వమే నేకోరుకున్నది

నాతప్పులు చూపే నీ ధైర్యం
నా మంచిని తెలిపే నీ చొరవ
నిరసన ప్రకటించే నీ మౌనం
ఆ సమతత్వమే నేకోరుకున్నది

నా బాధకు నీ అయ్యోలు
నా గొప్పకు నీ అబ్బోలు
నా చెంతన మన అరెయ్* ఒరెయ్* లు
ఆ మన-తత్వమే నేకోరుకున్నది

చంచలంగా నవ్వులు ఒలికిస్తూ
దయగల వాక్కులు పలికేస్తూ
నచ్చిన పనులే చేసేస్తూ
ఆ నీ ప్రస్తుతమే నేకోరుకున్నది

నా ఉనికి నిను మార్చొచ్చు
నా మాటను నిను కదిలించొచ్చు
నా ప్రేమ నిను బాధించొచ్చు
అందుకే నా మౌనం,
నీ సుఖమే నేకోరుకున్నది


galagala paarE nee navvu
giligintalu peTTE nee maaTa
haayini kurisE nee kaLLu
aa sahajatvame nEkOrukunnadi

noppincani nee guNam
laalincE nee manasu
kshamincE nee tatvam
aa sunnitatvamE nEkOrukunnadi

canuvugaa tirigE nee vainam
visuganipincani nee uusulu
vinasompaina nee gaLam
aa snEhatvamE nEkOrukunnadi

naatappulu cuupE nee dhairyam
naa mancini telipE nee corava
nirasana prakaTincE nee mounam
aa samatatvamE nEkOrukunnadi

naa baadhaku nee ayyOlu
naa goppaku nee abbOlu
naa centana mana arey orey lu
aa mana-tatvamE nEkOrukunnadi

chancalangaa navvulu olikistuu
dayagala vaakkulu palikEstuu
naccina panulE cEsEstuu
aa nee prastutamE nEkOrukunnadi

naa uniki ninu maarcoccu
naa maaTanu ninu kadilincoccu
naa prEma ninu baadhincoccu
andukE naa mounam,
nee sukhamE nEkOrukunnadi