27, అక్టోబర్ 2008, సోమవారం

హైకూలు ..

దేవుడు బ్రష్షు
దులిపినట్టు ఉంది
మా వూర్లో పార్కు


మాటలు నీపై
అలిగినట్టున్నాయి
అందుకే మౌనం



ఆకలేస్తోంది
కళ్ళే వంటలు అన్నీ
మింగుతున్నాయి



కధ ముందుకి
పేజీలు వెనకకి
నిద్ర గాల్లోకి



కోతకొచ్చింది
బాధ బాగా పండింది
కళ్ళు నిండాయి


పాపం కన్నీళ్ళు
కళ్ళకూ సొంతం కావు
జారుతున్నాయి



సుప్రభాతపు
రంగులు కనులలో
లోని చీకటి





dEvuDu brashshu
dulipinaTTu undi
maa vuurlO paarku

maaTalu neepai
aliginaTTunnaayi
andukE mounam

aakalEstOndi
kaLLE vanTalu annee
mingutunnaayi

kadha munduki
pEjeelu venakaki
nidra gaallOki

kOtakoccindi
baadha baagaa panDindi
kaLLu ninDaayi

paapam kanneeLLu
kaLLakuu sontam kaavu
jaarutunnaayi

suprabhaatapu
rangulu kanulalO
lOni ceekaTi