23, అక్టోబర్ 2008, గురువారం

నువ్వెక్కడ ?

ఆలోచనల అడవుల్లో
తిరిగితిరిగి అలిసి ఆగిన
ప్రతి మజిలీ ఎందుకో
నీ జ్ఞాపకమే అవుతుంది

నీ చిత్రాలు బందీ చేసి
పెట్టిన పేజీలు ఎంత
తిరగేసినా ఏదో తెలియని
అసంతృప్తి కొంటెగా ఇకిలిస్తుంది

వందల ముఖాలు రోజూ
చూస్తూ నవ్వులు ఎన్ని
ఒలికించినా నువ్వు లేని ఆ
వెలితి ఒంటరితనమై నవ్వుతుంది

ఇంతకీ నువ్వీ రోజెక్కడ ?
ఏమై పోయావు ?


aalOcanala aDavullO
tirigitirigi alisi aagina
prati majilee endukO
nee jnaapakamE avutundi

nee citraalu bandee cEsi
peTTina pEjeelu enta
tiragEsinaa EdO teliyani
asamtRpti konTegaa ikilistundi

vandala mukhaalu rOjuu
cuustuu navvulu enni
olikincinaa nuvvu lEni aa
veliti onTaritanamai navvutundi