31, అక్టోబర్ 2008, శుక్రవారం

నిజము

గుండె కోతకు రాలి చెదిరిన
నా ప్రేమ పెంకులు చాలవూ ?
మనసు మంటలు రగిలి చెరిగిన
నా రాత విరుపులు చాలవూ ?
ఇంకా...
ఏమి మిగిలి నాను నేనని..?

కాల చక్రపు ఇరుసు నడిమిన
నలిగి మిగిలిన తనువు చాలదూ ?
గతం కొలిమిలొ కరిగి కారి
సమ్మెటలకొగ్గిన గాధ చాలదూ ?
ఇంకా...
ఏమి తప్పులు చేసినానని.. ?

కరుకు నిజముల ఇరుకు బాటన
ఎదురు దెబ్బల పయన మాగదా ?
మూగ బాసల మెదులు భావము
ఎరుక చెప్పగ తపన మాగదా?

ఏమి తప్పులు చేసినానని.. ?
ఇంకేమి మిగిలి నాను నేనని..?


gunDe kOtaku raali cedirina
naa prEma penkulu caalavuu ?
manasu manTalu ragili cerigina
naa raata virupulu caalavuu ?
inkaa...
Emi migili naanu nEnani..?

kaala cakrapu irusu naDimina
naligi migilina tanuvu caaladuu ?
gatam kolimilo karigi kaari
sammeTalakoggina gaadha caaladuu ?
inkaa...
Emi tappulu cEsinaanani.. ?

karuku nijamula iruku baaTana
eduru debbala payana maagadaa ?
muuga baasala medulu bhaavamu
eruka ceppaga tapana maagadaa?

Emi tappulu cEsinaanani.. ?
inkEmi migili naanu nEnani..?