గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...
16, సెప్టెంబర్ 2008, మంగళవారం
మామూలు మనిషి
గుండెలు తోడి వాడి గోళ్ళతో నొక్కినా
మృదువుగా మ్రోగగల వీణను కాను
మనసును తొలిచి వేడి దబ్బనాలు గుచ్చినా
అందంగా పాడగల వేణువు కాను
తోలు వొలిచి కసిగా కాల్చి కట్టినా
పాటకు ప్రాణమిచ్చే తప్పెట కాను
చిన్న విషయాలకు ఆనంద పడుతూ
ఉన్న ప్రేమను బయట పెడుతూ
చేజారిన దాని కోసం బాధ పడుతూ
అందని దానికై ఆరాటపడుతూ
అందిన వాడిపై ఈర్ష్య పడుతూ
బ్రతుకు నడిపే మనిషిని
మామూలు మనిషిని
నేను మామూలు మనిషిని !!
gunDelu tODi vaaDi gOLLatO nokkinaa
mRduvugaa mrOgagala veeNanu kaanu
manasunu tolici vEDi dabbanaalu guccinaa
andangaa paaDagala vENuvu kaanu
tOlu volici kasigaa kaalci kaTTinaa
paaTaku praaNamiccE tappeTa kaanu
cinna vishayaalaku aananda paDutuu
unna prEmanu bayaTa peDutuu
cEjaarina daani kOsam baadha paDutuu
andani daanikai aaraaTapaDutuu
andina vaaDipai eershya paDutuu
bratuku naDipE manishini
maamuulu manishini
nEnu maamuulu manishini !!