స్నేహమిది అని మభ్య పడుతూ
నేస్తం నువ్వని బుజ్జగిస్తు
నీకై వేచిన ప్రతి క్షణం
కాలక్షేపమని సద్దు కుంటూ
నిన్ను కానని మనసు మధనను
వెర్రి తనమని సమాధానపడుతు
నీ మాటకోసం పడె తపనను
పిచ్చితనమని పెదవి విరుస్తూ
నా మాటల గారడీలో
నలిగిన నిజాల మధ్య
ఎదురు చూపుల్లో ఎండి వాలిన
రెప్పల సమక్షంలో
ఒంటిచేత్తొ చరిచిన చప్పట్లకు
అలిసిన చేతులతో
గుండె గుడిలో వెలిసిన దేవతకు
అంపకాలు సాగనంపటాలు
snEhamidi ani mabhya paDutuu
nEstam nuvvani bujjagistu
neekai vEcina prati kshaNam
kaalakshEpamani saddu kunTuu
ninnu kaanani manasu madhananu
verri tanamani samaadhaanapaDutu
nee maaTakOsam paDe tapananu
piccitanamani pedavi virustuu
naa maaTala gaaraDeelO
naligina nijaala madhya
eduru cuupullO enDi vaalina
reppala samakshamlO
onTicEtto caricina cappaTlaku
alisina cEtulatO
gunDe guDilO velisina dEvataku
ampakaalu saaganampaTaalu
గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...