గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...
25, సెప్టెంబర్ 2008, గురువారం
తృప్తి
అమ్మవైనా బాగుండేది
పాపగా నీ ఒళ్ళో ఆడేవాడిని
ప్రణవమై నీ అక్కున చేరేవాడిని
నేను నీవాడినన్న తృప్తుండేది
చెల్లి వైనా బాగుండేది
చెట్టపట్టలేసుకుని తిరిగేవాడిని
చిన్నతనాన్ని పంచేవాడిని
నువ్వు నాదానివన్న తృప్తుండేది
ప్రేయసివైనా బాగుండేది
నా ప్రాణము నువ్వుగ బ్రతికేవాడిని
ప్రళయం దాకా తోడుండేవాడిని
మనమొకటేనన్న తృప్తుండేది
నే మెచ్చిన చెలివై పోయావ్*,
దగ్గరేవున్నా మధ్యన దూరాలెక్కువ
మన మాటల్తో వాటిని చెరిపేద్దామా?
బందీ చెయ్యని బంధాలెక్కువ
మన చూపుల్తో వాటిని తెంపేద్దామా ?
విధి మన మధ్యన లోయలు తవ్వింది
మన స్నేహంతో వాటిని పూడ్చేదామా ?
అప్పటికైనా ఇప్పుడులేని తృప్తి తిరిగొస్తుందేమో !!
ammavainaa baagunDEdi
paapagaa nee oLLO aaDEvaaDini
praNavamai nee akkuna cErEvaaDini
nEnu neevaaDinanna tRptunDEdi
celli vainaa baagunDEdi
ceTTapaTTalEsukuni tirigEvaaDini
cinnatanaanni pancEvaaDini
nuvvu naadaanivanna tRptunDEdi
prEyasivainaa baagunDEdi
naa praaNamu nuvvuga bratikEvaaDini
praLayam daakaa tODunDEvaaDini
manamokaTEnanna tRptunDEdi
nE meccina celivai pOyaav,
daggarEvunnaa madhyana duuraalekkuva
mana maaTaltO vaaTini ceripEddaamaa?
bandee ceyyani bandhaalekkuva
mana cuupultO vaaTini tempEddaamaa ?
vidhi mana madhyana lOyalu tavvindi
mana snEhamtO vaaTini pooDcEdaamaa ?
appaTikainaa ippuDulEni tRpti tirigostundEmO !!