26, నవంబర్ 2008, బుధవారం

కవితా సుందరి నాట్యం

అందని స్నేహం చెందని ప్రేమ
గుండెల మంట వేదన పాట

వగచిన సమయము అవిసిన నయనము
రగిలిన గాయము పగిలిన హృదయము

కరిగిన కలలు విరిగిన ఎదలు
చెరిగిన గీతలు చిరిగిన రాతలు

నలిగిన తనువులు సడలిన బంధము
చెదిరిన ఆశలు కూలిన బాసలు

పిండే ఘటనలు మండే తపనలు
చెండే తలపులు ఎండే కొలుకులు

ఆగని కాలము సాగని పయనము
తరగని శోకము విరగని బంధము

తట్టుకు తిరిగే మనిషే ఉంటే
మలిచే మనసే అతనికి ఉంటే
కవితా సుందరి ప్రాణం పోసుకు
నాట్యమాడదా ముంగిట్లోన ?
సాంత్వన నింపద గుండెల్లోన ?


andani snEham cendani prEma
gunDela manTa vEdana paaTa

vagacina samayamu avisina nayanamu
ragilina gaayamu pagilina hRdayamu

karigina kalalu virigina edalu
cerigina geetalu cirigina raatalu

naligina tanuvulu saDalina bandhamu
cedirina aaSalu kuulina baasalu

pinDE ghaTanalu manDE tapanalu
cenDE talapulu enDE kolukulu

aagani kaalamu saagani payanamu
taragani SOkamu viragani bandhamu

taTTuku tirigE manishE unTE
malicE manasE ataniki unTE
kavitaa sundari praaNam pOsuku
naaTyamaaDadaa mungiTlOna ?
saantvana nimpada gunDellOna ?