నీకై నిండిన నా ప్రేమ -- అది విరగదు
నీ లేత పాదాలు కందక
నువు నిల్చున్నది నా అరచేతిలో -- అది కంపించదు
అవి తారలు కాదు రాలడానికి
నీకై నా నిండిన కనుదోయి -- అవి రాలవు
నిను తాకిన గాలులు.. చెలీ
నా శ్వాశలు .. అవి ఆగవు -- నీకై అవి ఆగవు
ఇక పిల్లలు పెద్దలు పావురాళ్ళంటావా
ఎవరి బ్రతుకు వారిది.
మన బ్రతుకులే ఒకరి కోసం ఒకరివి.. కాదంటావా ?
ముక్కలయిన నీ మనసు చూశావు గానీ
నిండిన కన్నులతో వాటినేరుకుంటున్న
నన్నెలా చూడలేదు ?
నీ గుండె నాకెప్పుడో ఇచ్చావుగా..
ఆ పగిలిన శబ్దం నీ గుండెది కాదు చెలీ
వెను తిరిగి అది నీకు చూపలేకే
ఈ నా పరుగు.. నీ నుండి దూరంగా
నీ మనసు ముక్కలు పొదువుకుంటూ
నా గుండె బీటలు కుట్టుకుంటూ..