ఆకాలమేలరా ననుజేర రాదూ
ఆనాటి ఆనవ్వు తిరిగేల రాదూ
పగలంత ముసుగేసి సాయాలు లేచినా
రాత్రేమొ రాకుండ ఉందేమొ చూసినా
ఈ రాత్రి కాపేసి భారంగ తూలినా
తెల్లార బోదంటు ఆశగా చూసినా ! ... ఆకాలమేలరా
నేనీడ భోరంటు శోకాలు పెట్టినా
టెంకాయ నీకంటు లంచాలు చూపినా
పెద్దగా గొంతెత్తి బెదిరించి చూసినా
వేనోళ్ళ కాలాన్ని ప్రార్ధించి చూసినా ! .. ఆకాలమేలరా
ఈ చేతి గడియారమాచేతికెట్టినా
తీసేసి కొన్నాళ్ళు పారేసిచూసినా
గోడమీదన దాన్ని తిరగేసి ఉంచినా
లోనున్న ఆసెల్లు పీకేసి చూసినా ! ... ఆకాలమేలరా
సామ దాన బేధ దండాలు వాడినా
పారిపోయిన ఘడియ గీతాలు పాడినా
ఆకాలమేమైన ఈదరిదాపు రాలేదు
ఉన్న కాలము కూడ చూస్తుండగా బాయె ! .. ఆకాలమేలరా
aakaalamElaraa nanujEra raaduu
aanaaTi aanavvu tirigEla raaduu
pagalanta musugEsi saayaalu lEcinaa
raatrEmo raakunDa undEmo cuusinaa
ii raatri kaapEsi bhaaramga tuulinaa
tellaara bOdanTu aaSagaa cuusinaa ! ... aakaalamElaraa
nEniiDa bhOranTu SOkaalu peTTinaa
Tenkaaya niikanTu lancaalu cuupinaa
peddagaa gontetti bedirinci cuusinaa
vEnOLLa kaalaanni praardhinci cuusinaa ! .. aakaalamElaraa
ii cEti gaDiyaaramaacEtikeTTinaa
tiisEsi konnaaLLu paarEsicuusinaa
gODamiidana daanni tiragEsi uncinaa
lOnunna aasellu piikEsi cuusinaa ! ... aakaalamElaraa
saama daana bEdha danDaalu vaaDinaa
paaripOyina ghaDiya giitaalu paaDinaa
aakaalamEmaina iidaridaapu raalEdu
unna kaalamu kuuDa cuustunDagaa baaye ! .. aakaalamElaraa
గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...