కొమ్మకు రెమ్మకు రెక్కలు వచ్చి
చెట్టును పొమ్మని రొమ్ములు దన్ని
అందలమెక్కే కర్కశ కొమరుల
అశ్లీలతను అనివార్యత అనను
ఆస్తిని తుంచే అనురాగంతోనో
కొరివిని పెట్టే అవసరమొచ్చో
పువ్వుల ముసుగుతొ ముళ్ళనుగప్పే
ప్రబుద్ధుల చూసి అబ్బుర పడను
హరిత పత్రపు దాసుడు వీడు
దానినందే మూలాల్ని మార్గాల్ని
తెలుసుకుంటూ తనవారిని మరిచిన
వాడిని చూసి సంబర పడను
వర్ణాలన్నీ ధవళ కాంతి నుంచి
విడివడినట్లు వంశం అద్దపు పగిలి
మిగిలిన పెంకులు తామూ అద్దాలంటూ
ప్రకటించటం ఏమి వినోదం ?
నాస్టాల్జిక్ పొత్తిళ్ళనొదిలి పరుగిడుతున్న
వంశవృక్షాల శకలాలను సమయం
చెర్నకోలై అదిలించక పోవటం - అవును
ఎంతటి చిద్ర దృశ్య విషాదం !
kommaku remmaku rekkalu vacci
ceTTunu pommani rommulu danni
andalamekkE karkaSa komarula
aSleelatanu anivaaryata ananu
aastini tuncE anuraagamtOnO
korivini peTTE avasaramoccO
puvvula musuguto muLLanugappE
prabuddhula cuusi abbura paDanu
harita patrapu daasuDu veeDu
daaninandE muulaalni maargaalni
telusukunTuu tanavaarini maricina
vaaDini cuusi sambara paDanu
varNaalannee dhavaLa kaanti
nunci viDivaDinaTlugaa
vamSam addampu pagilina penkulu
taamuu addalugaa prakaTincaTam Emi vinOdam ?
naasTaaljik pottiLLanodili parugiDutunna
vamSavRkshaala Sakalaalanu samayam
cernakOlai adilincaka pOvaTam - avunu
entaTi chidra dRSya vishaadam !
http://sahitheeyanam.blogspot.com/2008/11/blog-post_25.html స్పందించి రాసినది.
గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...