నిద్ర మరిచి కంటిమంటల కాంతిలో
నేను నా కవితా వీక్షణ చేశానీరాత్రి
ఆనంద మేసింది - కళ్ళు చెమరాయి - రాయ గలననిపించింది
ఆశ్చర్య మేసింది - భృకుటి ముడివడి - ఏమిటీరాతలనిపించింది
భయమేసింది - ఊపిరాగి పోయి - నేనేమి చేసేసానో!? అనిపించింది
బాధేసింది - పెద్ద నిట్టూర్పు - నువ్వెలా తట్టుకున్నావోననిపించింది
రూపంలో చందన శిల్పమవొచ్చు
చూపులో చంద్రుని వెన్నెలుండొచ్చు
మాటలు అమృతమొలికనట్టుండొచ్చు
నవ్వులు నవనీతమద్దినట్టుండొచ్చు
నా చిన్నా, మున్నా, కన్నా అనాలనిపించొచ్చు
అంతా నీ స్నేహం, ఆత్మీయత, మంచితనం
ఐతే !!?
ప్రేమించెయ్యడమే ? కవితలల్లేయడమే?
కన్నీరొలకించేయ్యడమే? అనిపించింది
బాధ్యత మరిచానేమో అనిపించింది
బుద్ధి బజారెళ్ళినట్టనిపించింది
నిను బాధించానేమో అనిపించింది
నిజం చెప్పొద్దూ..బహుశా,
నిన్ను ప్రేమించాననుకోవడం
ప్రేమించడం కూడా నిజమేనేమో
మళ్ళీ అదే మాట!
ఖాళీ బుర్రా శత మర్కటక:
అన్నట్టుంది. మళ్ళీ అదే తప్పు !
స్నేహమయుంటుంది అవును స్నేహమే !!!
ప్రేమ తెలియని మనిషిని కదా
అదే ప్రేమ అనుకున్నట్టున్నాను
క్షంతవ్యుడిని. ఎదేమైనా..
నిన్నిప్పుడు ఏమని సంబోధించను ?
తెలిసి ప్రియా అనలేను. అనను
సరే ఎదేమైనా నేస్తం
అదో అద్భుత భావన
అదో ఆనందానుభూతి
అదో అవిశ్రాంత స్పందన
అది లేక నా మాట కవిత
కాదేమో నే రాయలేనేమో?
చూస్తున్నావుగా ఈ తవిక తిప్పలు ?
వేరే చెప్పాలా ..?
గురువులేని ఏకలవ్యుడి శిష్యరికంలా
నా కవితా సుందరితోనే నా యుగళగీతం
సాగించగలనేమో ప్రయత్నిస్తాను
మరేదన్నా రాయగలనేమో,
ఆ నా సమయం కోసం
వేచిచూస్తాను. అంత దాకా సెలవు.
సదా నీ ..
( అబ్బ!! మరదే ! తొందరెందుకు ? పూర్తిచెయ్యనీ ..)
సదా నీ.. స్నేహం కోరే
--నేను
nidra marici kanTimanTala kaantilO
nEnu naa kavitaa veekshaNa cESaaneeraatri
aananda mEsindi - kaLLu cemaraayi - raaya galananipincindi
aaScharya mEsindi - bhRkuTi muDivaDi - EmiTeeraatalanipincindi
bhayamEsindi - uupiraagi pOyi - nEnEmi cEsEsAnO!? anipincindi
baadhEsindi - pedda niTTuurpu - nuvvelaa taTTukunnaavOnanipincindi
ruupamlO candana Silpamavoccu
cuupulO candruni vennelunDoccu
maaTalu amRtamolikanaTTunDoccu
navvulu navaneetamaddinaTTunDoccu
naa cinnaa, munnaa, kannaa anaalanipincoccu
antaa nee snEham, aatmeeyata, mancitanam
aitE !!?
prEminceyyaDamE ? kavitalallEyaDamE?
kanneerolakincEyyaDamE? anipincindi
baadhyata maricaanEmO anipincindi
buddhi bajaareLLinaTTanipincindi
ninu baadhincaanEmO anipincindi
nijam ceppodduu..bahuSaa,
ninnu prEmincaananukOvaDam
prEmincaDam kuuDaa nijamEnEmO
maLLee adE maaTa!
khaaLee burraa Sata markaTaka:
annaTTundi. maLLee adE tappu !
snEhamayunTundi avunu snEhamE !!!
prEma teliyani manishini kadaa
adE prEma anukunnaTTunnaanu
kshantavyuDini. edEmainaa..
ninnippuDu Emani sambOdhincanu ?
telisi priyaa analEnu. ananu
sarE edEmainaa nEstam
adO adbhuta bhaavana
adO aanandaanubhuuti
adO aviSraanta spandana
adi lEka naa maaTa kavita
kaadEmO nE raayalEnEmO?
cuustunnaavugaa ee tavika tippalu ?
vErE ceppaalaa ..?
guruvulEni EkalavyuDi Sishyarikamlaa
naa kavitaa sundaritOnE naa yugaLageetam
saagincagalanEmO prayatnistaanu
marEdannaa raayagalanEmO
aa naa samayam kOsam
vEcicuustaanu. anta daakaa selavu.
sadaa nee ..
( abba!! maradE ! tondarenduku ? puurticeyyanee ..)
sadaa nee.. snEham kOrE
--nEnu
గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...