తండ్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తండ్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఫిబ్రవరి 2009, శనివారం

నీ బ్రతుకూ బ్రతుకేనా ?

నడక నేర్పిన చేయి నిస్సత్తువై వణకుతుంటే
రెక్క లొచ్చిన కాళ్ళు వెనుదిరిగి వెక్కిరిస్తూ
పచ్చ నోట్ల తోనె పలుకరిస్తుంటే
పలుకు లిచ్చిన పెదాలు పాలి పోయాయి
నీ కోసం ప్రార్ధనలో మునకలెస్తున్నాయి !!

పొత్తి గుడ్డల్లో స్వార్ధాన్ని సాకుతున్నామని
ఆనాడీ పిచ్చి పెద్దోళ్ళకెరుక లేదు
ప్రేమగా లాలించి పాము పెంచామని
ఈనాటికీ వీరు ఒప్పుకోరు

చెదిరిన గుండెలు పిండిన చమురులో
ఆశదీపాలెట్టి బేలగా చూస్తున్నారు.

పున్నామ నరకాల మాట చచ్చాక
బ్రతికుండగా వీడు కొరివి పెడుతున్నాడు
బాధలతొ పెరిగిన గుండె మంటను
పచ్చనోటుతో ఆర్పచూస్తున్నాడు

నేర్చిన నడకకు వచ్చిన పలుకుకు
వెలగట్టు నీ బ్రతుకూ బ్రతుకేనా ?


===========================

naDaka nErpina cEyi nissattuvai vaNakutunTE
rekka loccina kaaLLu venudirigi vekkiristuu
pacca nOTla tOne palukaristunTE
paluku liccina pedaalu paali pOyaayi
nii kOsam praardhanalO munakalestunnaayi !!

potti guDDallO svaardhaanni saakutunnaamani
aanaaDii picci peddOLLakeruka lEdu
prEmagaa laalinci paamu pencaamani
iinaaTikii viiru oppukOru

cedirina gunDelu pinDina camurulO
aaSadiipaaleTTi bElagaa cuustunnaaru.

punnaama narakaala maaTa caccaaka
bratikunDagaa viiDu korivi peDutunnaaDu
baadhalato perigina gunDe manTanu
paccanOTutO aarpacuustunnaaDu

nErcina naDakaku vaccina palukuku
velagaTTu nii bratukuu bratukEnaa ?

25, నవంబర్ 2008, మంగళవారం

నాన్నా ఎలా వున్నావు ?

తమ గుండె ముక్కపై
ఎంబసీ ముద్రతో గూటిని విడిచి
అందలమెక్కిన తనయుల అడుగుల
క్రిందన నలిగిన తండ్రుల చేతులు అవిగో

ప్రగతి పధంలో ఈజీ పాసులో
ఝామ్మని ఎగిరే లెక్ససు వెనకన
బురదతొ నిండీ ప్రేమతొ తడిసిన
తండ్రుల ఆర్తి నిండిన గాధలు అవిగో

ఏడు జలధుల ఆవల నుండి వాట్సప్‌
అంటూ ఎప్పటికీ ఆర్తిగ మ్రోగని
ఆ ఫోనుల కోసం ఆత్రంగా పడిగాపులు కాసి
ఎండిన కన్నుల్లో నిండిన శుభాకాంక్షలవిగో

-- మా అబ్బాయిని అప్పుడప్పుడూ ఫొను చెయ్యమన్న
-- ఓ తండ్రి మాటలకు నా స్పందన

tama gunDe mukkapai
embasee mudratO guuTini viDici
andalamekkina tanayula aDugula
krindana naligina tanDrula cEtulu avigO

pragati padhamlO eejee paasulO
jhaammani egirE leksasu venakana
buradato ninDii prEmato taDisina
tanDrula aarti ninDina gaadhalu avigO

EDu jaladhula aavala nunDi vaaTsap
anTuu eppaTikee aartiga mrOgani
aa phOnula kOsam aatramgaa paDigaapulu kaasi
enDina kannullO ninDina SubhaakaankshalavigO

12, జూన్ 2007, మంగళవారం

తండ్రి

భూమి పైన అడుగిడి నప్పుడు
నింగికెగసిన మనసు తనది
అడుగులు తడబడు వసున
అందొచ్చిన వేలు తనది
మొదటి మాట పలుకు నప్పుడు
తోడయ్యిన మాట తనది
ఆరోగ్యపు గడబిడ లలొ
అదిరిపడిన గుండె తనది
గుండు సున్న మార్కులొస్తె
తపన పడిన తలపు తనది (మధన పడిన మది తనది)
మంచి మార్కులొచ్చి నప్పుడు
చాటిచెప్పిన నోరు తనది
బాధ అన్నది రాకుండగ
చెమటోడ్చిన తనువు తనది

చిన్న మాట అన్నాడని
ముఖము చాటు చేయబోకు
వయసు మళ్ళిన ముసలి వాడని
చీడ పురుగుల చూడబోకు
పనులు చేసే పటువులేదని
ఈసడించుచు కసురుకోకు

నీకు భారము అయ్యినందుకు
కుమిలిపోయే కనులు చూడు
నీకు సాయము చేయలేక
కృంగిపోయిన ఆ మనసు చూడు

కడుపు మంటను దాచుకుంటు
కంటి నీటిని మింగుకుంటు
గుండెపిండి తిండి పెట్టిన
తండ్రి కాలికి వందనం !!

=======================

bhuumi paina aDugiDi nappuDu
ningikegasina manasu tanadi
aDugulu taDabaDu vasuna
andoccina vElu tanadi
modaTi maaTa paluku nappuDu
tODayyina maaTa tanadi
aarOgyapu gaDabiDa lalo
adiripaDina gunDe tanadi
gunDu sunna maarkuloste
tapana paDina talapu tanadi (madhana paDina madi tanadi)
manci maarkulocci nappuDu
caaTiceppina nOru tanadi
baadha annadi raakunDaga
cemaTODcina tanuvu tanadi

cinna maaTa annaaDani
mukhamu caaTu cEyabOku

vayasu maLLina musali vaaDani
ceeDa purugula cuuDabOku

panulu chEsE paTuvulEdani
eesaDincucu kasurukOku

neeku bhaaramu ayyinanduku
kumilipOyE kanulu cuuDu
neeku saayamu chEyalEka
kRngipOyina aa manasu cuuDu

kaDupu manTanu daacukunTu
kanTi neeTini mingukunTu
gunDepinDi tinDi peTTina
tanDri kaaliki vandanam !!