24, సెప్టెంబర్ 2008, బుధవారం

నా నీడ


ఉదయాన్నే నాతోడొస్తావు
మధ్యాహ్నానికి నాతో కలుస్తావు
సాయంత్రానికి దూరంగా వెళ్తావు
రోజంతా చూట్టూ తిరుగుతావు
చిలిపిగా దోబూచులాడతావు
వెలుగుల్లో నన్నంటి ఉంటావు
చీకట్లో అంతా ఉంటావు
నిను ముట్టలేను - ముట్టి మురవలేను
నిను కట్టలేను - కట్టి దాచలేను
నిను విడవలేను - విడిచి బ్రతకలేను
ఎప్పటికీ నాతోడుగ నువ్వుంటావా ?

నేనే నువ్వన్నప్పుడు
నాతోనే నువ్వున్నప్పుడు
నా రుజువే నువ్వైనప్పుడు
నా నీడవు నువ్వైనప్పుడు,
ఆ ప్రశ్నకు తావేలేదు!!


udayaannE naatODostaavu
madhyaahnaaniki naatO kalustaavu
saayantraaniki duurangaa veLtaavu
rOjantaa cuuTTuu tirugutaavu
cilipigaa dObuuculaaDataavu
velugullO nannanTi unTaavu
ceekaTlO antaa unTaavu
ninu muTTalEnu - muTTi muravalEnu
ninu kaTTalEnu - kaTTi daacalEnu
ninu viDavalEnu - viDici bratakalEnu
eppaTikee naatODuga nuvvunTaavaa ?

nEnE nuvvannappuDu
naatOnE nuvvunnappuDu
naa rujuvE nuvvainappuDu
naa neeDavu nuvvainappuDu,
aa praSnaku taavElEdu!!