30, సెప్టెంబర్ 2008, మంగళవారం

నాకంటే !


నాగూర్చి నాకంటే నీ కళ్ళకే తెలుసు
నిను తలిచినప్పుడల్లా అవి కొట్టుకుంటునాయి
నాగూర్చి నాకంటే నీ శ్వాసకే తెలుసు
నిను పిలిచినపుడల్లా నిన్నవి చేరుకుంటున్నాయి
నాగూర్చి నాకంటే నీ నవ్వులకే తెలుసు
నిను చూసినపుడల్లా నాగుండె నింపుకుంటున్నాయి
నాగూర్చి నాకంటే నీ కాళ్ళకేం తెలుసు ?
నను చూసి ఎందుకలా పరుగులెడుతున్నాయి ?


naaguurci naakanTE nee kaLLakE telusu
ninu talicinappuDallaa avi koTTukunTunaayi
naaguurci naakanTE nee SvaasakE telusu
ninu pilicinapuDallaa ninnavi cErukunTunnaayi
naaguurci naakanTE nee navvulakE telusu
ninu cuusinapuDallaa naagunDe nimpukunTunnaayi
naaguurci naakanTE nee kaaLLakEm telusu ?
nanu cuusi endukalaa paruguleDutunnaayi ?

నేను


స్వాతి చినుకును నేను
ముత్యమై జలధిలో దాగి ఉంటున్నాను
సంధ్య కిరణం నేను
చీకటై రాత్రిలో కలిసి పోతున్నాను
చిరుగాలిని నేను
దూరాలు పోలేక అలిసిపోతున్నాను
చిరునవ్వును నేను
ఒక్క క్షణం బ్రతికి మాయమౌతున్నాను
గువ్వ పిట్టను నేను
గతాన్ని మరిచేసి ఎగురుతున్నాను
చకోరాన్ని నేను
ఆశగా చినుకుకై ఎదురుచూస్తున్నాను
మామూలు మనిషిని నెను
నా పంజరంలోనేను ఒదిగిపోతున్నాను
ఏకాంతాన్ని నేను
తనలో ఒకటై కలిసిపోతున్నాను

swaati cinukunu nEnu
mutyamai jaladhilO daagi unTunnaanu
sandhya kiraNam nEnu
ceekaTai raatrilO kalisi pOtunnaanu
cirugaalini nEnu
duuraalu pOlEka alisipOtunnaanu
cirunavvunu nEnu
okka kshaNam bratiki maayamoutunnaanu
guvva piTTanu nEnu
gataanni maricEsi egurutunnaanu
cakOraanni nEnu
aaSagaa cinukukai edurucuustunnaanu
maamuulu manishini nenu
naa panjaramlOnEnu odigipOtunnaanu
Ekaantaanni nEnu
tanalO okaTai kalisipOtunnaanu

29, సెప్టెంబర్ 2008, సోమవారం

శుభాకాంక్షలు


నువ్వు నడిచే ప్రతి బాటా
ఓపూబాట కావాలని
చేరే ప్రతి గమ్యం
ఓ తోట కావాలని
తగిలే ప్రతి బంధం
ప్రణయ మల్లికలై తోడివ్వాలని
పొడిచే ప్రతి ఉదయం
ప్రణవమై సంతోషాలకు శ్రీకారమవ్వాలని
ఆ రాబోయే ప్రతి కష్టానికి
గమ్యం నా కనులవ్వాలని
నా రాబోయే ప్రతి సుఖం నవ్వులై
పువ్వులై నీ దోసిళ్ళు నిండాలని
మ్రోగే వేదమంత్రాల సాక్షిగా
నీకివి నా దీవెనలు
నీ జన్మదినానికి
నా శుభాకాంక్షలు

nuvvu naDicE prati baaTaa
OpoobaaTa kaavaalani
cErE prati gamyam
O tOTa kaavaalani
tagilE prati bandham
praNaya mallikalai tODivvaalani
poDicE prati udayam
praNaVamai santOshaalaku Sreekaaramavvaalani
aa raabOyE prati kashTaaniki
gamyam naa kanulavvaalani
naa raabOyE prati sukham navvulai
puvvulai nee dOsiLLu ninDaalani
mrOgE vEdamantraala saakshigaa
neekivi naa deevenalu
nee janmadinaaniki
naa Subhaa kaankshalu

28, సెప్టెంబర్ 2008, ఆదివారం

రాలిన క్షణాలు


పరుగెట్టే కాలం ఒరవడికి
రాలిపోయే క్షణాలెన్నో
నీ రాకతో అది స్థంభించినప్పుడు
కాస్త తీరిక దొరికింది
గుండెలోతుల్లోకి తొంగిచూసి
రాలిన క్షణాలేరుకుంటూ
జ్ఞాపకాల అరల్లో సద్దుకుంటున్నా
వాటిని వదిలేసి నే
చేసిన తప్పులు దిద్దుకుంటున్నా
కడిగి మరువలేని
అనుభూతులుగా మార్చుకుంటున్నా!!

parugeTTE kaalam oravaDiki
raalipOyE kshaNaalennO
nee raakatO adi sthambhincinappuDu
kaasta teerika dorikindi
gunDelOtullOki tongicuusi
raalina kshaNaalErukunTuu
jnaapakaala arallO saddukunTunnaa
vaaTini vadilEsi nE
cEsina tappulu diddukunTunnaa
kaDigi maruvalEni
anubhuutulugaa maarcukunTunna!!

అది


ఎంతో చెప్పాలన్న ఆరాటం
ఎదో అడగాలన్న తపన
నీ ముందు మనసు మూగబోతుంది
భాష పలకనంటుంది
ఎంత చెప్పినా 'అది ' చెప్పలేదన్న
వెలితి మిగిలి పోతుంది
ఆ 'అది ' ఏదని వెతకటంలో
రోజంతా గడిచి పోతుంది
నువ్వెళ్ళెపోతావ్‌
ఎదురు చూపుల్లో
ఈ రాత్రీ కరిగి పోతుంది
ఏదో చెప్పాలన్న ఆరాటం పెరిగిపోతుంది
నువ్వు లేవన్న నిజం గుచ్చుకుంటుంది
కుమ్మరి చక్రంలా బ్రతుకు
ఆ చోటే తిరిగి పోతుంది
ఏదో వెలితి మిగిలి పోతుంది
ఈ రోజూ గడిచి పోతుంది ...




entO ceppaalanna aaraaTam
edO aDagaalanna tapana
nee mundu manasu muugabOtundi
bhaasha palakananTundi
enta ceppinaa 'adi ' ceppalEdanna
veliti migili pOtundi
aa 'adi ' Edani vetakaTamlO
rOjantaa gaDici pOtundi
nuvveLLepOtaav
eduru cuupullO
ee raatrii karigi pOtundi
EdO ceppaalanna aaraaTam perigipOtundi
nuvvu lEvanna nijam guccukunTundi
kummari cakramlaa bratuku
aa cOTE tirigi pOtundi
EdO veliti migili pOtundi
ee rOjuu gaDici pOtundi ...

26, సెప్టెంబర్ 2008, శుక్రవారం

ఆ బాట


నందన వనాలు నాకఖ్ఖరలేదు
సుందర హర్మ్యాలు అవసరంలేదు
అత్తరు గంధాలు అసలేవద్దు
పూల బాటలు నగదు మూటలకై
చూసేవారు అదిగో అక్కడవున్నారు
పదును ముళ్ళతో కరుకు రాళ్ళతో
ఇరుకు దార్లతో నరకం చూపే
ఏదారైనా ఫరవాలేదు నాకది చూపు
ఆ బాటలకి గమ్యం నువ్వైతే చాలు
ఆనందంగా నడిచేస్తా
పరుగు పరుగున వచ్చేస్తా

nandana vanaalu naakakhkharalEdu
sundara harmyaalu avasaramlEdu
attaru gandhaalu asalEvaddu
puula baaTalu nagadu muuTalakai
cuusEvaaru adigO akkaDavunnaaru
padunu muLLatO karuku raaLLatO
iruku daarlatO narakam cuupE
Edaarainaa pharavaalEdu naakadi cuupu
aa baaTalaki gamyam nuvvaitE caalu
aanamdamgaa naDicEstaa
parugu paruguna vaccEstaa

వేపచెట్టు కధ


నేస్తం నీకీ కధ చెప్పానా?

మాఇంట్లో ఓ వేపచెట్టుండేది
చేదు నిజాల చాయనిస్తూ
పరుల బాధలు తనలో నింపుకుని
ఇంటి పెద్దగా బయట నిలిచిన వేపచెట్టు కధ

బ్రతుకు భారానికి క్రిందికి వంగి
పిల్లల కోసం ఊయల అవుతూ
పక్షుల కిల కిల అంతా పంచే వేపచెట్టు కధ

ఆకు రాలినా పువ్వు రాలినా
కొన్ని కొమ్మలు పొయిలో కెళ్ళినా
వసంతమదిగో వచ్చేస్తుందని
ఆబగ చూస్తు అండగ నిలచిన వేపచెట్టు కధ

నేస్తం నీకీ కధ చెప్పానా?


nEstam neekee kadha ceppaanaa?

maainTlO O vEpaceTTunDEdi
cEdu nijaala chaayanistuu
parula baadhalu tanalO nimpukuni
inTi peddagaa bayaTa nilicina vEpaceTTu kadha

bratuku bhaaraaniki krindiki vangi
pillala kOsam uuyala avutuu
pakshula kila kila antaa pancE vEpaceTTu kadha

aaku raalinaa puvvu raalinaa
konni kommalu poyilO keLLinaa
vasantamadigO vaccEstundani
aabaga cuustu anDaga nilacina vEpaceTTu kadha

nEstam neekee kadha ceppaanaa?